కళాశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ బహూకరణ

UPDATED 7th DECEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు దేవీసీఫుడ్స్ అధినేత పోట్రు బ్రహ్మానందం రూ.65 వేల విలువ గల ఆర్వో వాటర్ ప్లాంటును శుక్రవారం అందచేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యంతో కళాశాలకు ఆర్వో వాటర్ ప్లాంటును ప్లాంట్ మేనేజర్ రవీంద్రనాథ్ అందజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఐ. శారద మాట్లాడుతూ దాతల సహకారంతో విద్యార్థినీ, విద్యార్థులకు ఆరోగ్యకరమైన మంచి నీటిని అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్లాంటును బహూకరించిన దేవీసీఫుడ్స్ అధినేతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంటర్ స్వర్ణోత్సవాల సందర్భంగా దాతలు ప్లాంటును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us