UPDATED 11th APRIL 2018 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: ఏప్రిల్ 14 నుంచి 27వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణములో స్థానిక పాండవుల మెట్ట వద్ద నిర్వహిస్తున్న అతిరాత్ర ఉత్కృష్ట శ్రౌత సోమయాగానికి సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో బుధవారం ఆర్డివో కార్యాలయములో ఆర్.డి.వో వి. విశ్వేశ్వరరావు సమక్షములో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమన్వయ సమీక్షా సమావేశములో పోలీసు బందోబస్త్, భక్తుల, విఐపి ప్రవేశాలు, వాహనాల పార్కింగ్ తదితర పోలీసుశాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషను, లైటింగ్, స్ట్రీట్ లైటింగ్, త్రాగునీరు, టాయిలెట్స్, అగ్నిమాపక వాహనాలు, వైద్య ఆరోగ్య శాఖ తరుపున 108 అంబులెన్స్, మెడికల్ క్యాంప్స్, మెడికల్ టీం, స్వచ్చంధ సేవా సంస్థలు, సమాచార కేంద్రం ఏర్పాటు, విద్యుత్ తదితర అంశాలపై మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, డి.ఎస్.పి. చిలకా వెంకట రామారావు, ఆర్.డబ్ల్యూ.ఎస్ డిఇ కుమార్, ఉప ముఖ్యమంత్రి పిఎ నిమ్మకాయల సుబ్బారావు, డిప్యూటీ తహసీల్దార్ టి.ఎ. కృష్ణారావు, మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, అతిరాత్రం నిర్వహణ సభ్యులు రామకృష్ణ శర్మ, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, సిడిపివో ఎ. విజయలక్ష్మి, డివిజినల్ పంచాయితీ అధికారిణి నాగలత, ఈ.వో.పి.ఆర్.డి. కరక హిమమహేశ్వరి, ఎస్.ఐ ఎ. కృష్ణ భగవాన్, శ్రీనివాస భక్త సేవా సంఘం ప్రతినిధి దాసరి సత్యనారాయణ, అగ్నిమాపక అధికారులుతో సమావేశంలో చర్చించారు. ఈ సమావేశములో యాగ ప్రతినిధిగా హాజరైన రామకృష్ణ శర్మ మాట్లాడుతూ ఈ అతిరాత్రం యాగానికి రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, మొత్తం యాగం 14 రోజులలో సుమారు ఎనిమిది లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నామని, దానికి సంబంధించిన ఏర్పాట్లుకు ప్రభుత్వపరంగా కూడా సహకారం అందించి ఈ యాగాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యముగా యాగం చివరి రోజులయిన 25, 26, 27 మూడు రోజులు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పారు.







