నృత్యకారుడు అలమండకు నృత్యోత్సవ ఆహ్వానం

UPDATED 2nd NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రసిద్ధ శైవ క్షేత్రంలో ఈ నెల 4వ తేదీ నుంచి జరగనున్న కార్తీకమాస నృత్యోత్సవంకు పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు సంప్రదాయం ఆర్గనైజేషన్ నిర్వాహకులు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఎం. నవీన్ కుమార్ నుంచి ఆహ్వానం అందినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ నృత్యోత్సవం నృత్య గురువులతో కలిసి శ్రీశైలంలోని రెడ్డి కళాభవనంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతేడాది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జాతీయస్థాయి నృత్య పోటీల్లో శ్రీశైలంలో పాల్గొని శ్రీశైల నాట్యప్రభ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. శ్రీశైల మల్లిఖార్జున స్వామి వారి సన్నిధిలో రెండోసారి తనకు నృత్యం చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రసాద్ దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి రాణిస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా కార్తీకమాస నృత్యోత్సవంనకు ఆహ్వానం అందుకున్న ప్రసాద్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హెూంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), శ్రీ కంచి కామకోటి మహాసంస్థానం చైర్మన్ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, ప్రముఖ సీనియర్ కళాకారులు అంబటి అప్పారావు, పారిశ్రామికవేత్తలు సింగవరపు సాయిబాబు, తులసీధరరావు సోదరులు, క్లస్టర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), రోటరీ క్లబ్ నాయకుడు అంబటి సుబ్రహ్మణ్యం, శ్రీ వీరభద్రా జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్ర ప్రసాద్ (అగ్రో ప్రసాద్), తదితరులు అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us