ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రారంభం

UPDATED 5th FEBRUARY 2020 WEDNESDAY 5:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం- రాజమహేంద్రవరం రహదారిలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ మూడవ బెటాలియన్ నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (విజయవాడ సిటీ), హెచ్ఏసి ఆఫ్ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పొలీస్ ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ బి. శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం  సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ డిజిఎం కె. ముఖర్జీ,  సేల్స్ ఆఫీసర్ డి. శేఖర్ తో బంకు నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే బంకులో పని చేస్తున్న సిబ్బంది పనితీరు, వారికి చెల్లించే జీతాలు వివిరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ మూడవ బెటాలియన్ (కాకినాడ) కమాండెంట్ బి. శ్రీరామమూర్తి, అడిషనల్ కమాండెంట్ ఎం. నాగేంద్రరావు, అసిస్టెంట్ కమాండెంట్లు ఎం.బి.వి.వి. సత్యనారాయణ, ఎస్. దేవానందరావు, ఏఆర్ఎస్ఐ ఎస్. నాగభూషణం, ఏపీఎస్పీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us