యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు

UPDATED 25th AUGUST 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్  కళాశాలలో శనివారం యాంటీ ర్యాగింగ్ పై  అవగాహన సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఐ. శారద ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య అతిధిగా  సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాస్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ర్యాగింగ్ చట్టాలు, శిక్షలు గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాల గురించి తెలుసుకోవాలని, మంచి వ్యక్తులతో స్నేహం చేయాలని, అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలు కలిగిన వారితో స్నేహం చేయడం వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపాల్ శారద మాట్లాడుతూ విద్యార్థులు  చదువుపై దృష్టి సారిస్తే  మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us