గణితచదరంతో స్వాతంత్ర్యదినోత్సవానికి వినూత్న స్వాగతం

UPDATED 14th AUGUST 2018 TUESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్  ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని తోటకూర హేమమణి వర్షిత 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని గణితచదరంతో విభిన్న రీతిలో స్వాగతం పలికారు. గణిత చదరంలోని అడ్డువరుసలలో గల అంకెల మొత్తం 72, నిలువ వరుసలలో అంకెల మొత్తం 72, కర్ణాలలో గల అంకెల మొత్తం 72 ఇలా ఏ నాలుగు గడులలో అంకెలు కూడినా మొత్తం 72 వచ్చే విధంగా దీనిని రూపొందించడం విశేషం. ఈ సందర్భంగా వర్షితను ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, విద్యార్థినీ, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, తదితరులు అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us