రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటవ నెంబరు ప్లాట్ ఫారం వద్ద రైలు నుంచి గుర్తు తెలియని  వ్యక్తి  జారిపడి తీవ్ర గాయాలు అయినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జె. గోవిందరావు తెలిపారు. అపస్మారకస్థితిలో ఉన్న అతనిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి జేబులో తుని నుంచి సామర్లకోట వరకు పాసింజర్ రైలు టిక్కెట్టు ఉందని, గళ్ల తెలుపు రంగు చొక్కా, ఎరుపు రంగు బనియను, నీలం రంగు ప్యాంటు ధరించి, చేతికి కడియం ఉందన్నారు. ఆచూకీ కోసం సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us