గణిత చదరంతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

UPDATED 14th AUGUST 2020 FRIDAY 7:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): 74వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తోటకూర హేమమణి వర్షిత గణిత చదరాల ద్వారా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేసింది. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుచున్న హేమమణివర్షిత తనకు ఎంతో ఇష్టమైన గణిత చదరాల ద్వారా స్వాతంత్ర్య దినోత్సవానికి శుభాకాంక్షలు తెలిపింది. అడ్డు వరుసలు మొత్తం 74, నిలువ వరసలు మొత్తం 74, కర్ణాల మొత్తం 74 ఇలా పలు రకాలుగా ఎటు కూడిన 74 వచ్చే విధంగా 74 రకాల చదరాలను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. జాతీయ పర్వదినాలు, మహనీయుల పుట్టినరోజులు, తదితర వేడుకలకు ఈ విధంగా గణిత చదరాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డీన్ డాక్టర్ రవికుమార్, విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వర్షితను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us