గైట్ డిగ్రీ కళాశాలలో శిక్షణా తరగతులు

UPDATED 13th NOVEMBER 2018 TUESDAY 6:30 PM

రాజానగరం: గైట్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం-సాఫ్ట్ స్కిల్స్ పై మంగళవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఏపిఐటిఏ నుంచి వచ్చిన కార్పొరేట్ ట్రైనర్ కె.ఆర్.జె. కెనడీ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ సామర్ధ్యానికి పదునుపెడితే భవిష్యత్ బంగారుమయం అవుతుందని, కష్టపడే మనస్తత్వం అలవరచుకోవాలని అన్నారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆత్మస్థైర్యం ఎంతో అవసరమని తెలిపారు. ఇంటర్వ్యూలను సమర్ధవంతంగా ఎదుర్కొనే విధానాన్ని వివరించారు. గైట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వల్లీ మాధవి మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు రెండు రోజుల పాటు జరుగుతాయని, ఈ అవకాశాన్ని విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us