UPDATED 31st MARCH SATURDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక మున్సిపాలిటీలో కౌన్సిల్ అత్యవసర సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో గాంధీనగర్ లో నూతనంగా నిర్మాణం జరుపుతున్న దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఈ సమావేశంలో దుమారం నెలకొంది. వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశం జీరో అవర్ లో అధికార. ప్రతిపక్ష నేతలు దుర్గాప్రసాద్ స్కూల్ పై వివరణ కావాలని డిమాండ్ చేశారు. దుర్గా ప్రసాద్ స్కూల్ కి సంబంధించి ముడుపులు అందాయని ప్రముఖ పత్రికలో ఆరోపణలు వచ్చాయని దీనిపై వివరణ ఇవ్వాలని సీనియర్ కౌన్సిలర్ మన్యం చందర్రావు డిమాండ్ చేశారు. కౌన్సిల్ తీర్మానం చేసిన ఆరవ వార్డులో మున్సిపల్ స్థలానికి రక్షణ కల్పించలేదని ఊబా జాన్ మోజస్ ఆరోపించారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచే ఆశీల పాట మార్చి నెల చివరిలోనే అధికారులకు గుర్తుకు వస్తుందా అని ప్రతిపక్ష నేత ఆవాల లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు. మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







