UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు మండల విద్యా శాఖాధికారిణి రమణమ్మ పేర్కొన్నారు. స్థానిక విలేఖరులతో ఆమె పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షలకు 1498 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అలాగే పరీక్షకు తెలుగు మీడియం రాసేవారు 698, అలాగే ఇంగ్లీషు మీడియం పరీక్ష రాసేవారు 800 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.







