అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ భవనాలు

UPDATED 2nd JANUARY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: అన్నిసామాజిక వర్గాల వారికి కమ్యూనిటీ భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణ పరిధిలోని 14,18,26, 29 వార్డులలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించనున్న సామాజిక భవనాలకు మంత్రి బుధవారం  శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా పట్టణంలో  14వ వార్డులో రూ.10 లక్షలతో తెలుకుల కమ్యూనిటీ భవనం, 18వ వార్డులో రూ.25 లక్షలతో శెట్టిబలిజ కమ్యూనిటీ భవనం, 26వ వార్డులో రూ.25 లక్షలతో వెలమ కమ్యూనిటీ భవనం, 29వ వార్డులో రూ.5 లక్షలతో లారీ యూనియన్ అసోసియేషన్ భవనాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఈ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గత నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని సుమారు రూ.1000 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టామని, జనవరి నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా పేదప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించాలని మంత్రి కోరారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుక కిట్లు లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, వార్డు కౌన్సిలర్లు, లారీ అసోసియేషన్ యూనియన్  సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us