పారిశ్రామికాభివృద్ధితోనే దేశాభివృద్ధి

UPDATED 19th AUGUST 2017 SATURDAY 7:00 PM

గండేపల్లి: పారిశ్రామికాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా పారిశ్రామిక కేంద్రం( కాకినాడ) జనరల్ మేనేజర్ ఎ.వి.పటేల్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, ఎన్ ఐ ఎం ఎస్ ఎం ఈ (హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో రెండు వారాల పాటు నిర్వహించిన ఫాకల్టీ డవలప్మెంట్ ముగింపు   కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. నూతన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన విధానాలు వాటికి అవసరమైన ఆర్ధిక వనరుల లభ్యత మొదలైన అంశాల గురించి తెలియచేసారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా కీలక రంగాల పటిష్ఠతకు సహాయకారిగా ఉండే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు పెంపొందించు కోవడానికి మాత్రమే కాకుండా భావి సాంకేతిక నిపుణులకు వ్యవస్థాపక అభివృద్ధి అంశంపై అవగాహన కల్పించడానికి తమ కళాశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభూప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించి తమ కళాశాలకు సహాయ సహకారాలు అందచేసిన ఎన్ ఐ ఎం ఎస్ ఎం ఈ సంస్థకు కృతజ్ఞతలు తెలియచేసారు. అనంతరం కళాశాల వ్యవస్థాపక విభాగం  కోఆర్డినేటర్  బి ఎస్ ఎస్ వి రమణమూర్తి కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లను ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ఎం.వి. హరినాథబాబు, డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డాక్టర్ కె.సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, పలు ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us