ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

UPDATED 5th APRIL 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ 111వ జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ఉపప్రధానిగా కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేశారని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఖ్యాతి గడించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ మన్యం చందర్రావు, మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు లక్ష్మీనారాయణ, కో-ఆప్షన్ సభ్యులు, అందుగుల జార్జి చక్రవర్తి, జిల్లా మాలమహానాడు నాయకులు లింగం శివప్రసాద్, కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తాతపూడి కృష్టబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లూరి నాని ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు వల్లూరి సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us