ఆదిత్యలో జాతీయస్థాయి వర్క్ షాప్

UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సహకారంతో డీప్ లెర్నింగ్ ఫర్ బయో ఇంఫార్మేటిక్ అనే అంశంపై రెండురోజుల జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వర్క్ షాప్ కన్వీనర్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ట్రిపుల్ ఐటి కాంచీపురం-చెన్నై యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బి. మాజీ, ఎన్ఐటి రూర్కెలాకు చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ పంకజ్ కుమార్ షా, డాక్టర్ రత్నాకర్ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం డాక్టర్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశం వక్తలు మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగులో వచ్చిన నూతన టెక్నాలజీ డీప్ లెర్నింగ్ విధానం ద్వారా జీవరాశులలో ముఖ్యంగా మానవులలో సంభవించే ఆరోగ్యపరమైన సమస్యలను మానవ మేధస్సుతో సమానంగా ఆలోచించ గల రోబోటిక్ విధానంలో రోబోల ద్వారా వైద్యం అందించే సరిక్రొత్త విధానం గురించి తెలుసుకోవడం కోసం ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని అన్నారు. రోబోల ద్వారా కంప్యూటర్ సహాయంతో వ్యాధిని గుర్తించటం, వ్యాధి తీవ్రత గుర్తించడం, దానికి అనుగుణంగా వైద్యం అందించడం అనేది ఈ ప్రక్రియ ద్వారా చేయవచ్చని అన్నారు. వైద్యరంగంలో కంప్యూటర్ సేవలను విరివిగా ఉపయోగించి మెరుగైన, ఖచ్చితమైన వైద్యసేవలు అందించడానికి ఈ డీప్ లెర్నింగ్ ఫర్ బయో ఇంఫార్మేటిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు. డాక్టర్ మాజీ మాట్లాడుతూ 25సంవత్సరాల ఇంజనీరింగ్ టీచింగ్ రంగంలో అనేక సదస్సులలో వివిధ స్థాయిలలో పాల్గోవడం జరిగిందని ఆదిత్య ప్రాంగణంలో నేటి సదస్సు ఎంతో సంతృప్తిని మిగిల్చిందని అన్నారు. అనంతరం ముఖ్య అతిధులను ఆదిత్య యజమాన్యం తరుపున దుశ్శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 కళాశాలలకు చెందిన విద్యార్థులు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, సిఎస్ఈ&ఐటి విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎమ్. అనిల్ కుమార్, ప్రొఫెసర్ కె. అరుణ్ భాస్కర్, డాక్టర్ ఆర్.వి.ఎస్. లలిత, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us