కాకినాడ (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021: జిల్లాలో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంటు ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. కాకినాడ-విశాఖ పెట్రోకెమికల్ కారిడార్‌లో భాగంగా ఈ తరహా పరిశ్రమల దిశగా కసరత్తు జరుగుతోంది. మరోవైపు బిక్కవోలు మండలం బలభద్రపురం వద్ద నిర్మాణం పూర్తయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈనెలాఖరులో సీఎం చేతుల మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభం అవుతుందనే ప్రచారం సాగుతోంది. సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. ఈ క్లోరో ఆల్కలీ ప్లాంట్‌లో... సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్, క్లోరిన్‌గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ తదితర ఉత్పత్తులు తయారుకానున్నట్లు సమాచారం. ఈ పరిశ్రమ ద్వారా 500 మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి లభించే వీలుంది. 2014లో కేపీఆర్ ఫెర్టిలైజర్స్ ఈ పరిశ్రమ నిర్మాణం ప్రారంభించగా.. అభ్యంతరాల క్రమంలో 2015లో నిర్మాణం నిలిచిపోయింది. ఆ తర్వాత క్రమంలో ఆదిత్య బిర్లా సంస్థ ఈ పరిశ్రమను దక్కించుకుని నిర్మాణం పూర్తిచేసింది. త్వరలో అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







