జెఎన్టీయుకె కబడ్డీ జట్టుకు ఆదిత్య విద్యార్థి ఎంపిక

UPDATED 5th DECEMBER 2018 WEDNESDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం ట్రిపుల్ ఇ చదువుచున్న ఎ. విజయ్ కుమార్ జెఎన్టీయుకె పురుషుల కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ (చెన్నై)లో జరిగే సౌత్ జోన్ కబడ్డీ టోర్నమెంటులో పాల్గొనే యూనివర్సిటీ జట్టు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక ఈ నెల 11 నుంచి 13వతేదీ వరకు జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ కళాశాలల సిఎం కప్ లో పాల్గొనే కబడ్డీ  జట్టుకు కూడ ఎంపికైనట్లు రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్ ను కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ఫిజికల్ డైరెక్టర్, తదితరులు అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us