గంగవరం(రెడ్ బీ న్యూస్):
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు అవేర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాస్కులను శనివారం పంపిణీ చేశారు. మండలంలోని దొరమామిడి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో కూలీలు మాస్కులు లేకుండా పని చేయడాన్ని గమనించిన అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్ తమ పౌండేషన్ తరపున 150 మంది కూలీలకు మాస్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు, హ్యాండ్ కర్చీఫ్ తో ముఖానికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పీకేఎస్ మాధవన్ గిరిజనులు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కమిటీ సభ్యులు ఆదినారాయణ, ఉపాధ్యాయులు బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







