UPDATED 7th APRIL 2018 SATURDAY 7:00 PM
పెద్దాపురం: పట్టణంలో స్థానిక శతాబ్ది పార్క్ సమీపంలో ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇండోర్ స్టేడియంకు ఈ నెల10వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం నిర్మించే స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పిఎ నిమ్మకాయల సుబ్బారావుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఉలిమేశ్వరం ఎంపిటిసి పేకేటి వెంకటేశ్వరావు(దొరబాబు), తదితరులు పాల్గొన్నారు.







