UPDATED 8th APRIL 2017 SUNDAY 9:00 PM
సామర్లకోట: ఉపాధి హామీ పథకంలో నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లకు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఇస్తున్న పది రోజులు శిక్షణలో భాగంగా ఆదివారం క్షేత్రస్థాయి శిక్షణా పర్యటన కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా ఆదివారం మూడవ బ్యాచ్ టెక్నికల్ అసిస్టెంట్లు పిఠాపురం మండలం చిత్రాడ, జల్లూరు, ఎఫ్.కె.పాలెం గ్రామాలలో జరుగుతున్న పంటకాలువలు, చెరువులలో పూడికతీత, కొలతలు, తదితర ఉపాధి పనులను పరిశీలించినట్లు ఫ్యాకల్టీలు లివింగ్ స్టన్, సుధీర్ తెలిపారు. వీరి వెంట కోర్సు అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ ఎస్.కె. మోహిద్దీన్ ఉన్నారు.







