బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలు రక్ష

UPDATED 3rd AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: బిడ్డల ఎదుగుదలకు తల్లిపాలు శ్రీరామరక్ష అని మున్సిపల్ కౌన్సిలర్ పితాని సూర్యనారాయణ అన్నారు. స్థానిక బ్రౌన్ పేట సెంటర్ పరిధి ఐదవ వార్డులో గల మూడు అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సూర్యనారాయణ, సూపర్ వైజర్ బి.టి. సుందరి మాట్లాడుతూ బిడ్డపుట్టిన తర్వాత ఆరునెలలు వరకు తల్లిపాలు ఆహారంగా ఇవ్వాలని, మార్కెట్లో దొరికే బేబి ఫార్ములా పాలు ఇవ్వకుండా తల్లిపాలు ఇవ్వటం వలన వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం బాల సంజీవిని పథకం ద్వారా గర్భిణీలకు పోషకాహార సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పి. శ్యామలాదేవి, ఎం.వి. శ్రీలక్ష్మి, జి.శ్యామలాకుమారి, అధిక సంఖ్యలో గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us