UPDATED 7th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు దవులూరి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం పరీక్షా మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న 33 ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా మెటీరియల్ అందచేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల విటికర్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్ లు, పెన్నులు, రబ్బర్లు, అందచేశారు. ఈ కార్యక్రమంలో బొండు నూకరాజు, పోలిశెట్టి రాజేష్, మడగల శ్యాం కుమార్, గోకాడ రాజా, కీర్తి ఆర్య తదితరులు పాల్గొన్నారు.







