PSLV-C52: మూడు ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52

UPDATED 14 FEBRUARY 2022 06:00 AM

ISRO – PSLV-C52: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు ఉపగ్రహాలతో కూడిన పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ లాంచ్ విజయవంతం అయింది. ఆర్ఐశాట్1, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్ అనే మూడు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52.. నిర్ణిత సమయానికి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆదివారం తెల్లవారు జామున 4.29 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్.. 25.30 గంటల పాటు నిరాటంకంగా కొనసాగి.. సోమవారం తెల్లవారు జామున విజయవంతంగా ముగిసింది.

మూడు ఉపగ్రహాల ప్రత్యేకతలు..

ఆర్ఐశాట్1: 1710 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ద్వారా వ్యవసాయ, అటవీ, నీటి వనరుల సమాచారం సేకరించనున్నారు. ఇమేజ్ డేటా ఆధారంగా పనిచేసే ఈ ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి. ఆర్ఐశాట్ (ఈవోఎస్ -04)గా పిలిచే ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఐఎన్ఎస్-2టీడీ: 17.50 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ శాస్త్రవేత్తలు కలిసి రూపొందించారు. భవిష్యత్తు సైన్స్ అవసరాలు, పేలోడ్స్ ప్రయోగాల నిమిత్తం ఈ ఐఎన్ఎస్-2టీడీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆరు నెలల పాటు ఈ ఉపగ్రహ సేవలను వినియోగించుకోనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us