ఆదిత్యలో ఇంటర్ కాలేజెస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గ్రాండ్ సక్సెస్

UPDATED 4th MARCH 2018 SUNDAY 10:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో జరుగుతున్న జె.ఎన్.టి.యు.కె. మహిళల గేమ్స్ అండ్ స్పోర్ట్స్, పురుషుల, మహిళల అథ్లెటిక్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిసాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు రెండవరోజు సాయంత్రం నుంచి జరిగిన క్యాంపైర్, సాంస్కృతిక కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఉర్రూతలూగించాయి. ఈ మెగా ఈవెంట్ కు యాజమాన్యం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ పోటీలు విజయవంతానికి విశేష కృషి చేశారు. ఈ పోటీలలో విజేతలకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.పి.రాజు, జె.ఎన్.టి.యు.కె స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జి.శ్యామ్ కుమార్, క్యాంపస్ డైరెక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, బి.పి.డి.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజీ,  చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.హెచ్.మురళీ మోహన్, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us