UPDATED 23rd APRIL 2018 MONDAY 6:00 PM
గంగవరం: విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రంపచోడవరం శాసన సభ్యురాలు వంతల రాజేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ గంగవరంలో మన ఊరు-మన బడి ర్యాలీ కార్యక్రమంలో ఆమె సోమవారం పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, డిజిటల్ విద్యా బోధన, మధ్యాహ్న భోజనం ఇలా ప్రతిదీ ఉచితంగా పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి టి. ప్రభ, ఎంఈవో మల్లేశ్వరావు, ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, నరసాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.







