UPDATED 4th JULY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: మాదిగల ఆత్మగౌరవ జాతరను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వల్లూరి నాని మాదిగ పిలుపునిచ్చారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో కార్యకర్తలతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరగనున్న ఆత్మగౌరవ జాతర, సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్నారు. లక్షలాది మందితో నిర్వహించనున్న ఈ జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలను సంబందించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు ఆకుమర్తి పాదాలమ్మ, నందిక చక్రం, ముప్పిడి భూలక్ష్మి, మహేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.







