UPDATED 2nd MARCH 2020 MONDAY 9:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణకు నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పశువుల పెంపకందార్లు సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వై. శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని కట్టమూరు గ్రామంలో సోమవారం గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి పశువులను సంరక్షించేందుకు రైతులు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విబిఆర్ఐ ఎడి డాక్టర్ అనురాధ, కాండ్రకోట పశువైద్యాధికారి డాక్టర్ తోట నవీన్, వెటర్నరీ సిబ్బంది జివివి సత్యనారాయణ, రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ బర్రే నాగేశ్వరరావు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం సపోర్టర్ బచ్చల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







