UPDATED 9th AUGUST 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన పుల్లేటికుర్తి సత్తిరాజు కుటుంబ సభ్యులకు చంద్రన్నబీమా మంజూరుకాగా తొలివిడతగా రూ. ఐదు వేలను వార్డు కౌన్సిలర్ జుత్తుక సుబ్బలక్ష్మి, జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ గురువారం అందచేశారు. ఈ కార్యక్రమంలో భీమామిత్ర వేమగిరి రాజేశ్వరి, సిఆర్పీ బొడ్డు లక్ష్మి, జుత్తుక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.







