UPDATED 29th AUGUST 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్ ను మూడు కార్పోరేషన్లుగా విభజనకు నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పి.ఎస్. భగవాన్ (బాబీ) అన్నారు. స్థానిక పెన్షన్ లైన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేషన్ ను మూడు కార్పోరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా పరోక్షంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడమేనని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసా నాగేశ్వరరావు, వల్లపు రామారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పోలిపల్లి అన్నవరం, పోలిపల్లి బాబీ వర్ధన్, జై భీమ్ సంఘం అధ్యక్షులు దేవుళ్ళ రవితేజ, యువజన అధ్యక్షులు ఇంజుమళ్ల బుజ్జి, పిట్టా దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







