గడప గడపకూ జనసేన సిద్ధాంతాలు

UPDATED 6th DECEMBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. మండల పరిధిలోని పెదబ్రహ్మదేవం, మేడపాడు గ్రామాల్లో జనతరంగం కార్యక్రమంలో భాగంగా పార్టీ మానిఫెస్టోపై ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. పేద ప్రజల సంక్షేమానికి పార్టీ రూపొందించిన పథకాలపై ప్రతీ ఇంటినీ సందర్శించి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంతపురంలో జనతరంగం కార్యక్రమం ప్రారంభించారని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నారని అన్నారు. పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు బుధవారం నుంచి ఐదు రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి పార్టీ ప్రవేశపెట్టిన సిద్దాంతాలు, పధకాలను వివరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెంకే వెంకటలక్ష్మి, వడ్డే దుర్గాదేవి, సుంకర కృష్ణవేణి శ్రీనివాస్, గాది గోవిందరాజు, మలకల వెంకటేశ్వరరావు, సరోజ్ వాసు, ఎండి.షఫీయుల్లా, కంచుమర్తి రాజన్న, బుచ్చిరాజు, అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us