ఆదిత్య ప్రొఫెసర్ విజయకృష్ణకు డాక్టరేట్

UPDATED 26th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆర్.వి. విజయకృష్ణ జెఎన్టీయు (కాకినాడ) నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (డాక్టరేట్ ) పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. జెఎన్టీయు (అనంతపురం)కు చెందిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్. శ్రీనివాస కుమార్ నేతృత్వంలో విజయకృష్ణ సమర్పించిన డవలప్ మెంట్ అండ్ పెర్ఫార్మామెన్స్ ఎవాల్యూయేషన్ ఆఫ్ సాఫ్ట్ కంప్యూటింగ్ అప్ప్రోచెస్ ఫర్ కలర్ టెక్చర్ సెగ్మెంటేషన్ అనే థీసిస్ కు గాను ఈ డాక్టరేట్ పొందారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఎ. రామకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది డాక్టర్ విజయకృష్ణను అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us