UPDATED 1st MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోట పురపాలక సంఘం 2017--18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లించవలసిన ఇంటి, ఖాళీ స్థలం, నీటి పన్నులను వెంటనే చెల్లించాలని, అలా చెల్లించని ఎడల కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు తెలిపారు. ఈ నెల 31 వరకు అన్ని సెలవు దినాలతో సహా ప్రతీరోజు కార్యాలయంలో పన్నులు చెల్లించవచ్చని కమీషనర్ తెలిపారు.







