UPDATED 24th APRIL 2018 TUESDAY 7:00 PM
సామర్లకోట: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని గ్రామ టిడిపి నాయకుడు చల్లా బుజ్జి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామస్థులు మజ్జిగ పంపిణీ చేశారు.







