ప్రతిభ గల అభ్యర్థులకే గ్రామ వలంటీర్ల ఉద్యోగాలు

* జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ

UPDATED 23rd JULY 2019 TUESDAY 8:00 PM

పెద్దాపురం: ప్రతిభ కల్గిన అర్హులైన అభ్యర్థులకే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ వలంటీర్ల నియామకం కోసం మంగళవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆర్డీవో ఎస్.మల్లిబాబుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, ఆసుపత్రి సిబ్బంది హాజరుపట్టీ, ఒపి రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంపొందేలా వైద్యులు పనిచేయాలని తెలిపారు. ఆసుపత్రిలో మరుగుదొడ్ల పారిశుద్ధ్యం లోపభూయిష్టంగా ఉందని, దీనికి సంబంధించిన ఏజెన్సీకి మెమోను జారీచేయాలని ఆదేశించారు. స్టాఫ్ నర్స్ లు ఇద్దరు కావలసిఉందని, కొన్ని రకాల మందుల కొరత ఉందని, ప్రతీరోజు సుమారు 450 ఓపి వస్తుందని, అంబులెన్స్ రిపేరులో ఉందని, డ్రైవర్ పోస్టు లేదని వైద్యులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత సమస్యలపై తొలుత డిఎంహెచ్ఓకు తెలియజేయాలని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పేద ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి. కృష్ణారావు, ఆర్ఐ రవితేజ, ఆసుపత్రి యుడిసి నీరజ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us