UPDATED 23rd OCTOBER 2019 WEDNESDAY 9:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణాన్ని చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ టిసిఎల్ సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించినట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి పుష్పగుచ్ఛము ఇచ్చి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదిత్యలో గల లేబొరేటరీ సౌకర్యాలు, ఫాకల్టీ, తదితర అంశాలను పరిశీలించి తమ సంస్థలో విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులలో గల సృజనాత్మక శక్తిని గుర్తించి వారిలో గల నైపుణ్యాన్ని తెలుసుకొనేందుకు సదస్సు కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టిసిఎల్ కంపెనీ ప్రతినిధులు టెక్నికల్ లీడ్ అమండా, హెచ్ఆర్, వర్మ ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్.కుమార్, ప్లేస్ మెంట్ విభాగం అనిల్ పావులూరి, జి. హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







