ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

UPDATED  1st JANUARY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: నూతన సంవత్సర వేడుకలను రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో గల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గృహంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా  నియోజకవర్గ పరిధిలో గల ప్రజలు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో జిల్లా ఎస్‌పీ విశాల్‌గున్ని, జిల్లా పరిషత్ సిఇవో విద్యాసాగర్‌, డిఆర్‌వో సుబ్బలక్ష్మి, బిసి కార్పోరేషన్ ఇడి జ్యోతి, సమాచారశాఖ డిప్యూటి డైరెక్టర్‌ ఎం. ఫ్రాన్సిస్‌, డిఆర్‌డిఎ పిడి మధుసూదనరావు, డిఎంహెచ్‌వో డాక్టర్ టిఎస్‌ఆర్‌ మూర్తి, సివిల్‌ సప్లైస్‌ డిఎం జయరామ్‌, పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు, సామర్లకోట, పెద్దాపురం జెడ్‌పీటీసిలు గుమ్మళ్ళ విజయలక్ష్మి, సుందరపల్లి శివనాగరాజు, సామర్లకోట, పెద్దాపురం ఏఎంసి చైర్మన్లు పాలకుర్తి శ్రీనుబాబు, ముత్యాల రాజబ్బాయి, సామర్లకోట మున్సిపల్  వైస్‌చైర్మన్‌ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సామర్లకోట, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్లు అడబాల కుమారస్వామి, బొడ్డు బంగారుబాబు, ఆర్‌డబ్ల్యు.ఎస్‌ ఎస్‌ఇ అప్పారావు, ఆర్‌ &బి డిఇ సూర్యప్రకాశరావు, వ్యవసాయశాఖ జెడి ప్రసాద్‌, సర్వశిక్షాభియాన్‌ పిడి ఎం. శేషగిరి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఎం. నాగరాజు, ఆత్మా చైర్మన్‌ కలకపల్లి రాంబాబు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు రాజకుమారి, ఎన్‌.ఎస్‌.వి.బి. వసంతరాయుడు, పెద్దాపురం డిఎస్‌పీ చిలకా వెంకట రామారావు, పెద్దాపురం, సామర్లకోట ఎంపిడివోలు పి. వసంతమాధవి, సిహెచ్‌ జగ్గారావు, పెద్దాపురం, సామర్లకోట తహసీల్దార్లు గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, శివకుమార్‌, మన్యం చంద్రరావు, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్, సామర్లకోట మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొని మంత్రిని శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us