UPDATED 27th JULY 2020 MONDAY 5:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్ పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విధ్యా సంస్థల ప్రాంగణంలో గల పాలిటెక్నిక్ కళాశాలల ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా దేశానికి విశేష సేవలందించిన డాక్టర్ అబ్దుల్ కలాం ఐదవ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన కలాం జీవితం యావత్ విద్యార్థి లోకానికి ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, గ్రంథాలయ అధికారి కె. అశోక్ కుమార్, గ్రంథాలయ సిబ్బంది, వివిధ శాఖాధిపతులు, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







