ఆదిత్యలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

UPDATED 29th AUGUST 2017 TUESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల  క్యాంపస్ లో గ్రంధాలయ శాఖా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుభాషను వారసత్వ సంపదగా భావితరాలకు అందించేందుకు కాపాడాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై  ఉందన్నారు. ప్రతీ సంవత్సరం ఆగష్టు 29 న ఈ వేడుకలను జరుపుకోవడంతో పాటు అమ్మ భాషను, దాంట్లో గొప్పతనాన్ని ప్రతీ ఒక్కరికి తెలియచేయాలన్నారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, పద్యపఠన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన చేతుల మీదుగా  బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి,  ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె.రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, గ్రంధాలయాధికారి కె.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.    
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us