UPDATED 9th JANUARY 2020 THURSDAY 5:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం "రెసోనెన్సు-2020" కార్యక్రమం ఈనెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ పూర్వ విద్యార్థులకు భోజన, వసతి, తదితర సదుపాయాలు సమకూర్చామని అన్నారు. ఇంతవరకు సుమారు 1000 మంది ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ అయ్యారని, ఉదయం 9-30 నుంచి సాయంత్రం 4-30 వరకు వివిధ కార్యక్రమాలతో ఉత్సాహంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. పూర్వ విద్యార్థుల సమావేశం, ప్రసంగాలు, వారి అనుభవాలతో కూడిన సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 1కే మారథాన్, విభాగాల వారీగా ఆయా విభాగాలలో ప్రత్యేక కార్యక్రమాలు గ్రూప్ ఫోటో, జ్ఞాపికలు, ప్రతీ ఒక్కరికి టీ షర్ట్, బ్యాగ్ లను అందించడం జరుతుందని తెలిపారు. 2001 సంవత్సరం నుంచి 2019లో ఉతీర్ణులైన ప్రతీ ఆదిత్య విద్యార్థి ఈ కార్యక్రమంలో తప్పక పాల్గోవాలని సతీష్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్ ప్రొఫెసర్ జె.డి. వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.







