గంగవరం (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: పార్టీ బలోపేతానికి పార్టీ అభ్యర్థుల విజయానికి గ్రామస్థాయి నుంచి విచ్చేసిన నాయకులు కార్యకర్తల కృషిని మరువలేనిదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అన్నారు. మండలంలోని జడేరు గ్రామం శివారులో పార్టీ ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అనంత బాబు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ నుంచి విజయం సాధించిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కష్టసుఖాల్లో పాల్గొంటూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దశాబ్దకాలంగా కష్టనష్టాలు భరిస్తూ తన వెంట నడుస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో శ్రమించిన కార్యకర్తలకు అనంత బాబు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో విజయపథం వైపు తీసుకువెళ్ళదాంతోపాటు ఏజెన్సీలో అన్ని మండలాల్లో వైసీపీ జండా విజయకేతనం ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి ఎనలేనిదన్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో మరింత ఉత్సాహంతో పని చేయాలన్నారు. అనంతరం పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అనంత బాబు దు శ సత్కరించారు. ఈకార్యక్రమంలో జజడ్పీటీస సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కొటికలపూడి రామతులసి, కో ఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు గంగాదేవి, కనక లక్ష్మి, వెంకటలక్ష్మి, పద్మావతి. డీసీసీబీ మాజీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, సర్పంచులను నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించి సత్కరించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







