* ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి
UPDATED 20th DECEMBER 2020 SUNDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): క్రిస్మస్ తర్వాత కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పచ్చి అబద్ధమని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. అలాంటి వదంతులను నమ్మవద్దని ఎటువంటి ఆంక్షలు విధించలేదని చెప్పారు. ఇటువంటి తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25న క్రిస్మస్, అలాగే 31, జనవరి 1వ తేదీన కర్వ్యూ తరహా ఆంక్షలు ఉంటాయని ప్రచారం జరుగుతోందని, అలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. పోలీసు శాఖ నుంచి ఏదైనా సమాచారం ఉంటే పత్రికా ముఖంగా తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.







