ఈబీసీ కార్పోరేషన్ చైర్మన్ గా చైతన్యరాజు భాద్యతలు స్వీకరణ

UPDATED 14th FEBRUARY 2019 THURSDAY 10:00 PM

రాజానగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి సంఘం చైర్మన్ గా కెవివి సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) కానూరు (విజయవాడ)లో గల వెనుకబడిన సంక్షేమ శాఖ కార్యాలయంలో గురువారం సాయంత్రం భాద్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తన శక్తిమేర కృషి చేస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన ఈ బాధ్యతకు వన్నె చేకూరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ రవికిరణ్ వర్మ, తదితరులు హాజరయ్యారు.           

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us