మున్సిపల్ రెసిడెన్షియల్ కళాశాలకు ఎంపికైన విద్యార్థిని

UPDATED 11th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని పొన్నగంటి శ్రీలక్ష్మి మృదుల ప్రతిష్టాత్మకమైన నెల్లూరులోని మున్సిపల్ జూనియర్ రెసిడెన్సియల్ కళాశాలలో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఏడవ ర్యాంకు సాధించి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 59 మున్సిపల్ పట్టణాలు, కార్పోరేషన్ పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో తమ పాఠశాల విద్యార్థిని ఈ ఘనత సాధించిందని, మన జిల్లాలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మృదులను మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, తదితరులు అభినందించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us