UPDATED 30th OCTOBER 2020 FRIDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజల సహకారంతోనే కొవిడ్ నియంత్రణ సాధ్యపడుతుందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. పెద్దాపురం పట్టణంలో కొవిడ్ వారియర్ల ఆధ్వర్యంలో కొవిడ్ నియంత్రణపై శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్డీవో మల్లిబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలో పలు వీధులగుండా సాగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కరోనా మహమ్మారి పూర్తిగా నిర్మూలన కాలేదని, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రానున్న రెండు నెలలు ఎంతో కీలకమని మరింత జాగ్రతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జె. సురేంద్ర, తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఏరియా ఆసుపత్రి వైధ్యాధికారిణి డాక్టర్ సుదీప్తి, మున్సిపల్ మేనేజర్ నాగేశ్వరరావు, ఎస్సై ఏ. బాలాజీ, శానిటరీ ఇనస్పెక్టర్ దావీదురాజు, వైఎస్ఆర్సీపీ నాయకుడు నెక్కంటి సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







