గైట్ లో వర్చ్యూస సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ ప్రారంభం

UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల ప్రాంగణంలో వర్చ్యూస సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను వర్చ్యూస లీడ్ కోర్ ప్రాక్టీస్ అశ్విన్ సదాశివకుమార్ శ్యాంసుందర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వర్చ్యూస లీడ్ కోర్ ప్రాక్టీస్ అశ్విన్ సదా శివకుమార్ శ్యాంసుందర్, లీడ్ ఇండియా క్యాంపస్ హైరింగ్ క్రితి వాసన్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో  వర్చ్యూస సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ జావా సెంటర్ గైట్ ఒక్కటే అని తెలిపారు. సకల సదుపాయాలు కలిగిన మంచి క్యాంపస్ గా గైట్ ను గుర్తించి ఈ సెంటర్ నెలకొల్పామని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గైట్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పింస్తుందని, వాటిని వినియోగించుకుని ప్రయోజనం పొందడం విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. వర్చ్యూస సంస్థ అభివృద్ధిలో గైట్ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. గైట్ లో సిఎస్ఇ మూడవ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు  వర్చ్యూసలో ఇంటర్న్ షిప్ కల్పించామని, ఈ సమయంలో ప్రతీ నెలా రూ. పదివేలు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వర్చ్యూస లీడ్ కోర్ ప్రాక్టీస్ అశ్విన్ సదా శివకుమార్ శ్యాంసుందర్, గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీశశివర్మ పరస్పరం ఎంవోయూలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్చ్యూస సీనియర్ మేనేజర్ కోర్ ప్రాక్టీస్ శుభకరన్ రవీంద్రన్, చైతన్య సంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, గైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్  పి.వి.జి.కె. జగన్నాథరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎల్.ఎస్. గుప్త, డీన్ డాక్టర్ ఎం. వర ప్రసాదరావు, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఓ. బాలచందర్, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us