UPDATED 20th JUNE 2018 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సురంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు యోగా దినోత్సవం, దాని ప్రాముఖ్యత అంశంపై వ్యాసరచన పోటీలు బుధవారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో యోగా దినోత్సవం విశిష్టతను పెంపొందించడానికి ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని, ప్రతీ ఒక్కరూ యోగా విశిష్టత గురించి తెలుసుకోవాలన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జూన్ 21న జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రధానం ఉంటుందని తెలిపారు. క్యాంపస్ లో గల హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులతో ఉదయం యోగాసనాలు కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్లు ఎమ్. సోమిరెడ్డి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.







