UPDATED 15th FEBRUARY 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం: పెద్దాపురం ఆర్&బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అంబటి సూర్యప్రకాశరావు శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. ఇంతవరకు పెద్దాపురం ఆర్&బి డివిజినల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ నుంచి ఆయన భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సూపరెంటెండెంట్ ఇంజనీర్ విజయ్ కుమార్, తదితరులు ఆయనను అభినందించారు.







