హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: తెలంగాణ పోలీసుల వైఖరిపై పీసీసీ అధ్యక్షుడు, మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను కలిసి చర్చించి భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలనుకుంటే... తనను వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వివరించారు. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు తమను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచి హక్కులను కాలశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదే పదే గృహనిర్బంధం చేస్తూ తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. లిఖితపూర్వక సమాచారం లేకుండా పోలీసులు ఇంటిచుట్టూ మోహరిస్తురన్నారు, అనుమతి లేకుండా అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛను కాపాడాలని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







