ప్రజాస్వామ్యానికి పత్రికలే ప్రాణం

UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రజాస్వామ్యానికి పత్రికలే ప్రాణమని సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాస్ నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కె. లక్ష్మి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో  ఏపియుడబ్ల్యుజె పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ శ్రీనివాస్ నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి, సామాజిక మార్పుకు ప్రచార మాధ్యమాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని,  జర్నలిస్టులు, కొవ్వొత్తులు సమాజానికి వెలుగునివ్వడానికి కరిగిపోతూ ఉంటారని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం సఫలం కావడంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని, సమాజానికి మార్గదర్శకం చేసేవి పత్రికలని పేర్కొన్నారు. పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తాయని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, రొట్టెలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు అడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య), అధ్యక్షుడు యు. చంద్రదాస్, కార్యదర్శి దేవరకొండ సుధాకర్, కోశాధికారి పెమ్మాడి వీరభద్రవర్మ, సహాయ కార్యదర్శి ఎలిశెట్టి సత్యనారాయణ, పచ్చాకుల లోవరాజు, గోవిందవల్లబుల సుబ్రహ్మణ్యం (సుబ్బు), బిక్కిన వెంకట్, బద్ది కుమార్, ఇర్షాద్ ఆలీ, విజయ్, వినాయక్, ఎస్. సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us