హుస్సేన్ పురంలో డస్ట్ బిన్స్ పంపిణీ

UPDATED 4th OCTOBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి గురువారం ఇంటింటా ప్లాస్టిక్ డస్ట్ బిన్స్ పంపిణీ చేశారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతీ ఇంటి నుంచి తడిచెత్త, పొడిచెత్త సేకరించేందుకు వీలుగా వీటిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామస్థులు ఈ డస్ట్ బిన్స్ వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ నీరజ, అంగన్వాడీ కార్యకర్తలు, సాధికార మిత్రలు , తదితరులు పాల్గొన్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us